Thursday, March 28, 2024

‘జాతిరత్నాలు’ ఫన్ ఫిల్మ్..

- Advertisement -
- Advertisement -

Jathi Ratnalu movie unit press meet

నవీన్ పోలిశెట్టి హీరోగా ప్రియా అబ్దుల్లా హీరోయిన్‌గా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ’జాతిరత్నాలు’. స్వప్న సినిమాస్ పతాకంపై అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమలు పూర్తిచేసుకొని మార్చి 11న వరల్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రం టీజర్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేసింది చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో హీరో నవీన్ పోలిశెట్టి, నటుడు ప్రియదర్శి, హీరోయిన్ ప్రియా అబ్దుల్లా, నిర్మాత నాగ్ అశ్విన్, దర్శకుడు అనుదీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. “పూర్తిగా ఇది అనుదీప్ చిత్రం. ప్రియాంక, స్వప్న సపోర్ట్‌తో చాలా జాగ్రత్తగా చేశాం. నాకు జంధ్యాల, ఈవివి, ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాలు అంటే బాగా ఇష్టం. వాళ్ల సినిమాలు ఇప్పటికీ యూట్యూబ్‌లో చూసినా పెదవిపై ఒక చిరునవ్వు వస్తుంది. అలాంటి ఫన్ ఫిల్మ్ ఈ ‘జాతిరత్నాలు’. సెటైరికల్ సినిమా ఇది. అందరికీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాం”అని అన్నారు. దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ “టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇది ఒక పూర్తి వినోదభరిత చిత్రం. ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు”అని తెలిపారు. హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ.. “ఔట్ అండ్ ఔట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. ప్రతి ఒకరినీ కడుపుబ్బా నవ్విస్తుంది ఈ చిత్రం”అని చెప్పారు.

Jathi Ratnalu movie unit press meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News