Thursday, November 7, 2024

మ‌హాశివ‌రాత్రి కానుక‌గా ‘జాతిర‌త్నాలు’

- Advertisement -
- Advertisement -

'Jathi Ratnalu' to release on March 11

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో మంచి పేరు సంపాదించిన యంగ్ హీరో న‌వీన్‌ పొలిశెట్టి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘జాతిర‌త్నాలు’. ఈ చిత్రంలో నవీన్ తోపాటు ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణలు జాతిరత్నాలుగా టైటిల్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది.ఈ మూవీని పూర్తి వినోదాత్మకంగా రూపొందిస్తున్నారు. స్వ‌ప్న సినిమా ప‌తాకంపై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనుదీప్ కెవి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీలో సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ చిత్రాన్ని మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న విడుదల చేయనున్నట్లు  వెల్లడిస్తూ చిత్రయూనిట్ మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల ‌చేసింది. ఈ మూవీకి రధన్ సంగీతం అందిస్తున్నారు.

‘Jathi Ratnalu’ to release on March 11

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News