Friday, March 29, 2024

పంట వ్యర్థాల దహనం సమస్యకు కొత్త టెక్నాలజీతో చెక్: ప్రకాశ్ జావదేకర్

- Advertisement -
- Advertisement -

Javadekar meeting with State Environment Ministers on Pollution

న్యూఢిల్లీ: పంట వ్యర్థాల దహనం కారణంగా ఏటా ఢిల్లీతోపాటు పొరుగు రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్‌లో అలుముకుంటున్న దట్టమైన వాయు కాలుష్యాన్ని నివారించిడానికి పూసా వ్యవసాయ పరిశోధనా సంస్థ రూపొందించిన నూతన టెక్నాలజీని ఈ ఏడాది ఉపయోగించనున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ తెలిపారు. ఈ నూతన టెక్నాలజీ వల్ల పంట వ్యర్థాలు వ్యవసాయ క్షేత్రంలోనే కుళ్లిపోయి, భూమిలో కలిసిపోతాయని ఆయన వెల్లడించారు. పంట వ్యర్థాల దహానానికి సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ఆయన ఐదు రాష్ట్రాలకు చెందిన పర్యావరణ మంత్రులతో గురువారం వీడియో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడచిన మూడేళ్లుగా పంట వ్యర్థాల దహనం తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించడానికి మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Javadekar meeting with State Environment Ministers on Pollution

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News