Home జాతీయ వార్తలు రాజౌరిలో ఎదురుకాల్పులు.. జవాన్‌ మృతి

రాజౌరిలో ఎదురుకాల్పులు.. జవాన్‌ మృతి

Army Jawan killed

 

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి జిల్లాలో సరిహద్దు రేఖ వద్ద భారత్ మరియు పాకిస్తాన్ దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆర్మీ జవాన్ మరణించాడు. రక్షణ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం… “శుక్రవారం నౌషెరా సెక్టార్లో కాల్పుల విరమణ ఉల్లంఘన ఉదయం 5.50 నుండి ఉదయం 7.30 వరకు జరిగాయని ఆయన చెప్పారు. పాకిస్తాన్ దళాలు జరిపిన కాల్పులు మరియు దాడుల్లో, జవాన్ నాయక్ సుబాష్ థాపా (25) గాయపడ్డాడు. దీంతో అతడిని మిలటరీ కమాండ్ హాస్పిటల్ ఉధంపూర్కు తరలించారు. జమ్మూ జిల్లాలోని అఖ్నూర్ సెక్టార్‌లో పాకిస్తాన్ షెల్లింగ్‌లో ఇద్దరు జవాన్లు కూడా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Jawan killed in Pakistan shelling along LoC in Rajouri