Home జాతీయ వార్తలు నన్ను ఏడిపించిన పాపానికి ఇది శాపం

నన్ను ఏడిపించిన పాపానికి ఇది శాపం

 

లక్నో: మహిళలను ఏడిపించిన పాపానికి ఇది శాపమని సమాజ్‌వాది పార్టీ ఎంపి ఆజం ఖాన్‌పై బిజెపి నాయకురాలు, మాజీ ఎంపి జయప్రద మండిపడ్డారు. భూకజ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆజం ఖాన్ గత సోమవారం ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ తనపై గొర్రెలు, కోళ్లు దొంగిలించిన కేసులు కూడా పెడుతున్నారని భావోద్వేగానికి గురై కంటతడిపెట్టారు. దీనిపై జయప్రద స్పందిస్తూ తాను బాగా నటిస్తానని ఆజం ఖాన్ ఎద్దేవా చేసేవారని, మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తన నియోజకవర్గం రాంపూర్ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించినందుకు తాను ఇప్పుడు మూల్యం చెల్లించవలసి వస్తోందని ఆజం ఖాన్ వాపోయారు. గత ఏప్రిల్ నుంచి ఆజం ఖాన్‌పై 72 కేసులు నమోదయ్యాయి. ఆయన కూడా భూ మాఫియాలో సభ్యుడని యుపిలోని యోగి ఆదిత్య ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది.

 

Jaya Prada strikes at Azam Khan

 

Jaya Prada strikes at Azam Khan, This is a curse of the tears women have shed because of him