Home తాజా వార్తలు నటుడు జయప్రకాశ్ రెడ్డి ఇకలేరు

నటుడు జయప్రకాశ్ రెడ్డి ఇకలేరు

Jaya prakash reddy Passes away

అమరావతి: గుంటూరులోని విద్యానగర్‌లో సినీనటుడు జయ ప్రకాశ్ రెడ్డి (73) కన్నుమూశాడు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో జయ ప్రకాశ్ రెడ్డి తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పెర్కొన్నారు. టాలీవుడ్, కోలీవుడ్ లలో విలన్‌తో పాటు కామెడీ సీన్లలో నటించి మెప్పించారు. 1946 మే 8 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెళ్ల గ్రామంలో జన్మించాడు. దాదాపుగా వందకు పైగా చిత్రాల్లో నటించారు. జయ ప్రకాశ్ మృతిపట్ల సినీ ప్రముఖలు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.