Home అంతర్జాతీయ వార్తలు షికాగోలో వీధికి జయలలిత పేరు

షికాగోలో వీధికి జయలలిత పేరు

jayalalithaవాషింగ్టన్ : తమిళనాడు దివంగత సిఎం జయలలిత పేరును అమెరికాలోని ఓ వీధికి పెట్టారు. షికాగోలోని బ్రాబ్‌వే అవెన్యూ, డెవన్ అవెన్యూ , నార్త్‌షెరిడాన్ వీధులు కలిసే చోట ఓ విధికి డాక్టర్ జె.జయలలిత అనే పేరు పెట్టారు. వెస్ట్‌డెవన్ అవెన్యూలో జయలలితకు తోడుగా మహాత్మాగాంధీ, మహమ్మద్‌అలీ జిన్నా, గోల్డామీర్‌ల పేర్ల మీద కూడా వీధులు ఉన్నాయి. జయలలిత నాయకత్వానికి సమాజంలో అణగారిన వర్గాల పట్ల ఆమెకున్న అంకితభావానికి గుర్తింపుగా ఈ పేరు పెట్టి గౌరవించినట్లు అప్పటి ఇలినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్గర్ పేర్కొన్న విషయం తెలిసిందే. జయకు ఈ గుర్తింపు లభించడం వెనుక ఇలినాయిస్ సెనేటర్ హోవర్డ్ డబ్‌లయ కెరోల్ అసలు సూత్రధారి. తమిళనాడును ఆదర్శంగా తీసుకుని ఇలినాయిస్‌లో కూడా మహిళా పోలీసుస్టేన్‌లను ఏర్పాటు చేస్తామని, మహిళా -శిశుసంక్షేమ పథకాలు ప్రవేశపెడతామనిఆయన నాడు చెప్పడం తెలిసిందే.