Home తాజా వార్తలు జయరాం హత్య కేసులో శిఖాను ప్రశ్నిస్తున్న పోలీసులు

జయరాం హత్య కేసులో శిఖాను ప్రశ్నిస్తున్న పోలీసులు

 

 Jayaram

హైదరాబాద్: జయరాం హత్య కేసులో శిఖా చౌదరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గురువారం పది గంటల ప్రాంతంలో శిఖా ఎసిపి ఆఫీస్ కు చేరుకుంది. జయరామ్ హత్య, రాకేష్‌తో సంబంధాలు, ఇతర విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జయరామ్‌ను రాకేష్ రెడ్డి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆస్తి కోసమే రాకేష్ రెడ్డి జయరాంను చంపినట్టు విచారణలో తేలింది. రాకేష్ రెడ్డి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు.

జయరాంను హత్య చేయడానికి రౌడీషీటర్ నగేశ్ సహకరం రాకేశ్‌ తీసుకున్నాడని దర్యాప్తులో తేలిందని పోలీసుల వెల్లడించారు. జయరాం హత్య చేసిన రోజు రాకేశ్ రెడ్డితో పాటు నగేశ్ ఉన్నట్లు వెల్లడైంది. జయరాంను హనీ ట్రాప్ చేయడంలో నగేశ్ కీలక పాత్ర వహించాడు. కిడ్నాప్ చేయడంలో నగేశ్ కీలక ప్రాత పోషించడమే కాకుండా తెల్లని బాండ్ పేపర్స్‌పై జయరాంను బెదిరించి సంతకాలు చేయించాడు. జయరాం ఆస్తులను కొట్టివేయాలని రాకేశ్ ప్లాన్ చేస్తే నగేశ్ పక్కాగా అమలు చేశాడు. నగేశ్‌తో పాటు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో నగేష్ పై రౌడీషీటర్ గా పోలీసులు కేసు నమోదు చేశారు.

Telangana news

 

Jayaram Murder Case: Shikha Investigate by Police