Home తాజా వార్తలు కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఇకలేరు

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఇకలేరు

kanchi-pithadipati

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి  బుధవారం ఉదయం (82) కన్నుమూశారు. శ్వాస సంబంధ వ్యాధితో కొంత కాలంగా బాధపడుతున్న జయేంద్ర కంచిలోని శంకర మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గత రాత్రి తుదిశ్వాస విడిచారు. 1935 జులై 18న తమిళనాడు తంజావురు జిల్లాలో జయేంద్ర  జన్మించారు. కంచి కామకోటి పీఠానికి జయేంద్ర 69వ పీఠాధిపతి అయ్యారు. జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రహ్మణ్యం మహాదేవ అయ్యర్. పీఠాధిపతి అయిన తర్వాత జయేంద్ర సరస్వతిగా పేరు మార్చుకున్నారు.