- Advertisement -
అనంతపురం : టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డికి మానసిక స్థితి బాగాలేదని, ఆయన మాటలు సభ్య సమాజం తలదించుకొనేలా ఉన్నాయని వైసిపి నాయకులు విశ్వేశ్వర్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి అన్నారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు మెప్పు కోసమే జెసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఆయనకు మతిస్థిమితం తప్పిందని మండిపడ్డారు. వైఎస్ జగన్పై నోరు జారితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. జెసి అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లే ఊసరవెళ్లి లాంటి వారని ఎద్దేవా చేశారు. జెసి వ్యాఖ్యలతో చంద్రబాబు వికృతానందం పొందారని దుయ్యబట్టారు.
- Advertisement -