Home జాతీయ వార్తలు బిహార్ లో జెడియు నేత దారుణ హత్య

బిహార్ లో జెడియు నేత దారుణ హత్య

JDU Leader Ashok Yadav Shot Dead In Biharపాట్నా: ‌బీహార్‌లో జెడియు నేత అశోక్ యాదవ్ (50) దారుణహ‌త్య‌కు గుర‌య్యారు. మాధేపురా జిల్లాకు చెందిన‌ ఆశోక్ యాదవ్ (50)పై దుండగులు బుధవారం ఉదయం విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఘటనాస్థలిలోనే అశోక్ యాదవ్ చనిపోయారు. జెడియు గాంహరియా బ్లాక్‌ ప్రెసిడెంట్‌గా అశోక్‌యాదవ్‌ పని చేస్తున్నారు.  తన స్వగ్రామం జోగ్బానీలో ఓ దుకాణం వద్ద నిలబడి ఉన్న అశోక్ యాదవ్ ను దుండగులు కాల్చి చంపారని మాధేపురా పోలీసులు మీడియాకు వెల్లడించారు. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు అశోక్ యాదవ్ పై కాల్పులు జరిపిన అనంతరం అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. దుండగులు కాల్పులు జరిపిన వెంటనే అశోక్ యాదవ్ ను స్థానికంగా ఉన్న సుపాల్ సదర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.