Home జాతీయ వార్తలు జెడి (యు) నేత త్యాగి కుమారుడు బిజెపి లోకి చేరిక

జెడి (యు) నేత త్యాగి కుమారుడు బిజెపి లోకి చేరిక

JD(U) leader KC Tyagi's son joins BJP

 

లక్నో : జనతాదళ్ (యునైటెడ్) జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి త్యాగి కుమారుడు అమ్రిష్ త్యాగి ఆదివారం బిజెపిలో చేరారు. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సిఎం దినేష్ శర్మ, ఇతర బిజెపి సీనియర్ నేతల సమక్షంలో ఈ చేరిక జరిగింది. త్యాగియే కాకుండా సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు బిజెపి సభ్యత్వాన్ని తీసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, సిఎం యోగి ఆదిత్యనాధ్ జాతీయ విధానాలు తమనెంతో ఆకర్షించాయని వీరు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా త్యాగి మాట్లాడుతూ 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాలు గెల్చుకుంటుందన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు.

JD(U) leader KC Tyagi’s son joins BJP