Thursday, March 28, 2024

జెఇఇ షెడ్యూల్ ప్రకటన, ఉపసంహరణ

- Advertisement -
- Advertisement -

ఫిబ్రవరి 22 నుంచి 25
వరకు జరపనున్నట్టు
షెడ్యూల్ పొందుపరిచిన
కొన్ని గంటల్లోనే
ఉపసంహరించుకున్న ఎన్‌టిఎ

JEE exam schedule cancelled

మన తెలంగాణ/హైదరాబాద్: జెఇఇ మెయిన్ పరీక్షల షెడ్యూల్ వి డుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) కొన్ని గంటల్లోనే దానిని ఉ పసంహరించుకుంది. మంగళవారం సాయంత్రం ఎన్‌టిఎ తన అధికారిక వెబ్‌సైట్‌లో జెఇఇ మెయిన్ షెడ్యూల్ ను పొందుపరించింది. తొలి జెఇఇ మెయిన్ పరీక్షను ఫిబ్రవరి 22 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ప్రకటించిన ఎన్‌టిఎ మంగళవారం నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే వెబ్‌సైట్ నుంచి జెఇఇ మెయిన్ సమాచార వివరాలను ఎన్‌టిఎ తొలగించింది. దాంతో జెఇఇ మెయిన్ 2021 షెడ్యూల్‌పై కొంత గందరగోళం తలెత్తింది. ఆ తర్వాత కొన్ని గంటలకు తొలి విడత పరీక్ష ఫిబ్రవరిలో నిర్వహిస్తామని ఎన్‌టిఎ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మరో మూడు సార్లు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షలను విద్యార్థులు ఒకేసారి రాయొచ్చు లేదా నాలుగు సార్లయినా రాసేందుకు వెసులుబాటు కల్పించింది. ఒకవేళ నాలుగు సార్లు రాసినా ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే ఆ మార్కులనే చివరగా పరిగణలోకి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News