Home తాజా వార్తలు నాని ‘జెర్సీ’ టీజర్ వచ్చేసింది..!

నాని ‘జెర్సీ’ టీజర్ వచ్చేసింది..!

JERSEYనేచరల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ‘జెర్సీ’ మూవీ టీజర్ విడుదలైంది. నాని క్రికెటర్ గా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ను సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది. టీజర్ లో ‘ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు గానీ… ప్రయత్నిస్తే ఓడిపోయినవాడు లేడు’ అనే డైలాగ్ బాగుంది. క్రికెటర్ గా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి నాని పడిన కష్టం… నిరుత్సాహ పరిచే మాటలను అధిగమించిన తీరు.. తాను అనుకున్న స్థాయికి చేరుకుని పొందిన ఆనందం ఈ టీజర్లో చూడొచ్చు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ స్వరాలు అందిస్తున్నాడు. వేసవి కానుకగా ఏప్రిల్ లో మూవీ విడుదల కానుంది.

JERSEY Official Teaser is Released