Friday, April 19, 2024

జార్ఖండ్‌లో ఐటి దాడులు…రూ. 2 కోట్లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జార్ఖండ్ ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన దాడుల్లో రూ. 2 కోట్లు స్వాధీనమయ్యాయి. రూ. 100 కోట్ల లెక్కల్లో చూపని పెట్టుబడి/లావాదేవీలు వెలుగుచూశాయి. మొత్తం 16 బ్యాంకు లాకర్లను నియంత్రణలో ఉంచారు.వివిధ రాష్ట్రాల్లోని 50 ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడులన్నీ బొగ్గు వర్తకం, రవాణా చేసే,సివిల్ కాంట్రాక్టులు నిర్వహించే, ఇనుప రజను,స్పాంజ్ ఐరన్ తయారు చేసే కొన్ని బిజినెస్ గ్రూపులపై నిర్వహించారు. ఈ ఐటి దాడులు రాంచీ, గొడ్డ, బెర్మో, డుంకా, జెంషడ్‌పూర్, చైబస, పాట్నా, గురుగ్రామ్, కోల్‌కతాలోని 50 ప్రాంగాణాల్లో నిర్వహించారు. ఈ దాడుల్లో అనేక కీలక సాక్షాధారాలు కూడా సేకరించారు. ఈ బిజినెస్ గ్రూపుల వారు పన్ను ఎగవేతలకు పాల్పడ్డారన్నది రూఢీ అయింది. ప్రత్యక్ష పన్ను సెంట్రల్ బోర్డ్(సిబిడిటి) ప్రకారం ఈ గ్రూపులోని ఒకరు సివిల్ కాంట్రాక్టులు కూడా నిర్వహిస్తున్నారని, కానీ ఖాతా పుస్తకాలు సరిగ్గా నిర్వహించడంలేదని, లెక్కల్లో అవకతవకలకు పాల్పడుతున్నారని తెలిసింది. పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నట్లు కూడా సిబిడిటి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News