ఇప్పటికే ఉచిత కాల్స్, ఇంటర్నెట్ వంటి ఎన్నో ఆఫర్లు ప్రకటించిన టెలికాం సంస్థ జియో, మరో కళ్లు చెదిరిపోయే అఫర్‌ను అందించేందుకు సిద్ధమవుతుంది. లైఫ్ మొబైల్స్‌తో జియో నెట్వర్క్ అందిస్తున్న రిలియన్స్ సంస్థ తాజాగా మరో చౌక ఫోన్‌తో మార్కెట్లో రంగప్రవేశం చేయనుంది. కేవలం 999 రూపాయిలకే 4జి ఫోన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఇందులో టచ్ స్క్రీన్ సౌకర్యం లేకపోయినా ఆండ్రాయిడ్ ఒఎస్ ఉంటుంది. యూజర్ అన్ని రకాల ఆండ్రాయిడ్ యాప్స్‌ని ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. బేసిక్ కీప్యాడ్‌తో ఈ ఫోన్ ఉంటుంది.
ఇందులో ముందుగానే జియోకు సంబంధించిన 4జి వాయిస్, మై జియో, జియో మ్యూజిక్, మూవీస్, టివి వంటి అప్లికేషన్ల్ పొందుపరిచి ఉంటాయటా.. ఈ ఫోన్‌ను ఈ మార్చిలో మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొంత మంది ఈ ఫోన్ రూ.999 ఉంటుందని అంటుంటే. మరీ కొందరు మాత్రం రూ.1000 నుంచి రూ.1500 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కూడా మార్చి 31న పూర్తి అవ్వనున్న విషయం తెలిసిందే.
జియో 4జి ఫోను.. రూ.999కే!
- Advertisement -
- Advertisement -