Home తాజా వార్తలు డేటా డార్క్ నుంచి డేటా షైనింగ్

డేటా డార్క్ నుంచి డేటా షైనింగ్

Reliance Jio AGM

 

న్యూఢిల్లీ : రిలయన్స్ జియో భారతదేశాన్ని ‘డేటా డార్క్ నుంచి డేటా షైన్’(డేటా చీకటి నుంచి డేటా వెలుగు)కు మార్చిందని కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 5న జియో 3 సంవత్సరాలు పూర్తి చేసుకోనుందని, జియో ప్రతి నెలా 10 మిలియన్ల మంది సభ్యులను చేర్చుకుంటోందన్నారు. జియో దేశంలోనే అతిపెద్ద టెలికం ఆపరేటర్ మాత్రమే కాదు, ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆపరేటర్ కూడా అని అన్నారు. జియో ద్వారా కొత్త వృద్ధి ఇంజిన్లు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవ, చిన్న,మధ్యతరహా వ్యాపారాల కోసం బ్రాడ్‌బ్యాండ్ ఉంటాయి. 1 జనవరి 2020 నుండి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్లాట్‌ఫాం అందుబాటులో ఉంటుంది. జియో గిగా ఫైబర్ నెట్‌వర్క్ వచ్చే 12 నెలల్లో పూర్తవుతుంది.

ముఖోష్ కుమారుడు ఆకాష్ అంబానీ మాట్లాడుతూ, జియో ద్వారా ప్రతి నెలా 100 మిలియన్ల వినియోగదారులు వీడియో కాల్స్ చేస్తారని, జియో గిగా ఫైబర్ ద్వారా వీడియో కాన్ఫరెన్సింగ్ చేయవచ్చని అన్నారు. జియో ఫైబర్ ప్లాన్ నెలకు రూ .700 నుంచి 10,000 వరకు లభిస్తుంది. ముఖేష్ కుమార్తె ఇషా అంబానీ మాట్లాడుతూ, ఇది ప్రపంచంలోనే ఉత్తమ గేమింగ్, గ్రాఫిక్స్ సామర్థ్యాలను కలిగి ఉందన్నారు. ప్రస్తుతం జియోలో 6 వేల మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారని, 15 వేల మంది ఇంజనీర్లను నియమించనున్నామని అన్నారు. రాబోయే 12 నెలల్లో జియో భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద బ్లాక్ చైన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది. మైక్రోసాఫ్ట్ సహకారంతో ప్రపంచ స్థాయి డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

Jio Has Turned India From Data Dark To Data Shining