Home టెక్ ట్రెండ్స్ జియో నెక్ట్‌ఫోన్‌పై అందరి దృష్టి

జియో నెక్ట్‌ఫోన్‌పై అందరి దృష్టి

Jio phone next launch details revealed

 

న్యూఢిల్లీ : దీపావళికి ముందు రిలయన్స్ జియో తన జియోఫోన్ నెక్ట్‌ను విడుదల చేయనుంది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సంస్థ చెబుతున్న ఈ ఫోన్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. అతి తక్కువ సమయంలోనే 43 కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకున్న జియో ఈ చౌకైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్ట్‌తో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన కొత్త ఫీచర్లు గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 215 క్యూఎమ్ 215 ప్రాసెసర్, 2జిబి ర్యామ్‌ను కల్గి వుంటుందని తెలుస్తోంది. జియోఫోన్ నెక్ట్ గురించి రిలయన్స్ ఎజిఎం 2021 సమయంలో ముకేశ్ అంబానీ ప్రకటించారు. దీపావళికి ముందు ఈ ఫోన్ లాంచ్ చేస్తామన్నారు. ఈ ఫోన్ ధర రూ.3499 ఉంటుందని తెలుస్తోంది.