Tuesday, February 7, 2023

ఏప్రిల్ 1నుంచి టారిఫ్‌లు

 • జియో ప్రైమ్ ఆఫర్
 • కోట్లు దాటిన కస్టమర్లు
 • ముఖేష్ అంబానీ వెల్లడి
- Advertisement -

Mukesh-Ambani

ముంబయి : సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన రిల యన్స్ జియో ఇక ఉచిత సేవలకు ముగింపు పలికి ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ ప్లాన్‌ను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈమేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటన చేశారు. జియో ప్రైమ్ ద్వారా ఏడాదిపాటు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ను పొడిగించారు. మార్చి 31 తర్వాత ప్రైమ్ మెంబర్ షిప్(ప్రధాన సభ్యత్వం) నమోదుతో అన్ని నెట్‌వర్క్‌లకూ ఉచిత కాలింగ్ సదుపాయం ఉంటుందని అన్నారు. మంగళవారం ముంబైలో నిర్వహించిన ప్రెస్‌మీట్ లో ఆయన కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పథకాలను అమలు చేయనున్నట్టు ప్రకటించారు. రికార్డు స్థాయి ఖాతా దారులను నమోదు చేసిన వినియోగదారులకు ఈ సంద ర్భంగా హృదయ పూర్వక ధన్యవా దాలు తెలిపారు. జియో రాకతో జియో వినియో గదారుల జీవితాలు డిజిటల్‌గా అం దంగా మారిపో యాయని అభివర్ణించారు.జియో ప్రారం భించి 170 రోజుల కావొస్తోందని.. ఇప్పటివరకు 100 మిలియన్ల కస్టమర్ల మార్క్‌ను దాటామని తెలిపారు. ప్రతి సెకండ్‌కు సుమారు 7 వినియోగదారులు చేరారని అన్నారు. జియో వినియోగదారులు ప్రతి నెలా 100 కోట్లకు పైగా జిబి డాటాను వినియో గించుకున్నారని, అంటే రోజుకు 3.3 కో ట్ల జిబిని వినియోగించుకున్నారని ముఖేష్ వెల్లడించారు. ప్రధానంగా ఏప్రిల్ 1 నుంచి టారిఫ్‌లను వసూలు చేయ నున్నట్లు స్పష్టం చేశారు. ఇతర నెట్‌వర్క్‌లు ఆఫర్ చేస్తున్న ధరల్లోనే డేటా పథకాలు అంది వ్వనున్నామని, అయితే 20 శాతం డేటా అదనంగా అందించనున్నామని తెలిపారు. 2017 చివరికల్లా దేశమంతా జియో నెట్‌వర్క్‌ను కవర్ చేయ డమే లక్ష్యమని అన్నారు. మార్చి 1తో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ముగియనున్న నేపథ్యంలో మరో ఆఫర్‌ను ప్రకటిం చారు. రూ.99 రుసుముతో జియో ప్రైమ్ మెంబర్‌షిప్ కార్య మాన్ని ప్రారంభించనున్నామని, మార్చి 31 వరకు ఈ సభ్య త్వాన్ని నమోదు చేసుకో వచ్చని చెప్పారు. ప్రైమ్ వినియో గదారులు మరో ఏడాది పాటుఉచిత సేవలను అందుకుం టారని.. రోమింగ్ సహా ఉచిత వాయిస్ కాల్స్ మార్చి 2018 వరకు పొందవచ్చని తెలిపారు.

టారిఫ్‌లను ప్రారంభించడంపై సిఒఎఐ హర్షం
రిలయన్స్ జియో కస్టమర్లు పది కోట్లకు చేరిన సందర్భంగా ఇక నుంచి టారిఫ్‌లను ప్రారంభించనున్నామని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించారు. జియో తాజా ప్రక టనపై సిఒఎఐ(సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) హర్షం వ్యక్తం చేసింది. రిలయన్స్ జియో ఉచిత సేవలకు ముగింపు పలికి టారిఫ్ వార్‌లోకి ప్రవేశించనుండ తో సంస్థ సానుకూలంగా స్పందించింది. ముఖ్యంగా ఏప్రిల్ 1 , 2017 నుంచి అమలు కానున్న టారిఫ్‌లను ప్రకటించ డంతో టెలికాం పరిశ్రమకు లభించిందని పేర్కొంది. ఉచిత సేవలస్థానంలో సేవలకు ధరలను ప్రతిపాదించడం పరిశ్ర మకు గుడ్ న్యూస్ అని పేర్కొంది. ఉచిత సేవలకు టాటా చెపుతూ టారిఫ్ ప్లాన్స్‌ను ప్రకటించడంపై టెలికాం సంస్థలు ఇంకా స్పందించాల్సి ఉన్నప్పటికీ , పరిశ్రమ పరిశీలకుడి గా, జియో ప్రకటనతో పరిశ్రమ ఉపశమనంగా ఉంటుందని చెప్పగలననికాయ్ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ వార్తా సంస్థతో తెలిపారు. ఇప్పటికైనా చార్జీల వసూళ్లను ప్రారంభించడం తనకు ఆనందం కలిగించిందని అన్నారు.

 • మొబైల్ డాటా వినియోగంలో భారత్ నంబర్ వన్ అయింది.
 • జియో నెట్‌వర్క్‌పై ప్రతి రోజూ 5.5 కోట్ల గంటల వీడి యోలు చూస్తున్నారు.
 • రోజు రోజూ మా నెట్‌వర్క్‌ను వేగవంతం గా పటిష్ఠం గా చేస్తున్నాం
 • వచ్చే రోజుల్లో దేశ జనాభాలో 99 శా తం మందికి నెట్‌వ ర్క్ కవర్ చేస్తాం
 • జియో టారిఫ్ ప్లాన్‌పై ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్ని దేశీ య వాయిస్ కాల్స్ ఉచితం
 • ప్రోమో ఆఫర్ ముగిస్తే ఏప్రిల్ 1 నుంచి రోమింగ్ ఉండదు, వచ్చే నెలల్లో రెట్టిం పు డాటా సామర్థం
 • జియో వినియోగదారుల ఆనందం కోరుకునే సంస్థ.. మా పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం సృష్టితో పటి ష్ఠ మైన డాటాతో కూడిన నెట్‌వర్క్.. డాటా డిజిటల్ లైఫ్‌కు ఆక్సీజన్
 • ఇతర ఆపరేటర్లతో పోలిస్తే 20 శాతం అదనంగా డే టా
 • జియో ప్రైమ్ సభ్యత్వం 2018 వరకు హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్‌కు కొనసా గింపు
 • ప్రైమ్ సభ్యత్వం తొలుత 100 మిలియ న్ల వినియో గదారు లు పొందుతారు.
 • ప్రైమ్ సభ్యులు న్యూ ఇయర్ ఆఫర్ అపరిమిత ప్ర యోజనాలను 2018 మార్చి వరకు పొందుతారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles