Home తాజా వార్తలు దేశంలో రెండో అతిపెద్ద టెలికామ్ సంస్థగా జియో

దేశంలో రెండో అతిపెద్ద టెలికామ్ సంస్థగా జియో

Reliance Jio

 

మూడో స్థానికి పడిపోయిన భారతీ ఎయిర్‌టెల్

బెంగళూరు: టెలికామ్ రంగంలోకి ప్రవేశించినప్పటి నుంచి రిలయన్స్ జియో తన దూకుడును కొనసాగిస్తూనే ఉంది. తాజాగా వినియోగదారుల పరంగా రెండో అతిపెద్ద టెలికామ్ సంస్థగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అవతరించింది. దీంతో భారతీ ఎయిర్‌టెల్ మూడో స్థానానికి పడిపోయింది. జియో మరోసారి లాభదాయకమైన టెలికాం ఆపరేటర్‌గా నిలిచి సత్తాను చాటింది. మరోవైపు వొడాఫోన్ ఐడియా మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా శుక్రవారం ఈ వివరాలను వెల్లడించింది. మే చివరి నాటికి జియోకు 322.98 మిలియన్ల వినియోగదారులు, ఎయిర్‌టెల్ 320.38 మిలియన్ల యూజర్లు ఉన్నారు. వోడాఫోన్ ఐడియా 387.55 మిలియన్ల వినియోగదారులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Jio to become second largest telecom company in India