Saturday, January 28, 2023

జూన్ 30వరకు ‘జియో’ ఫ్రీ..!?

- Advertisement -

Jio-Record

ప్రస్తుతం 4జి మొబైల్ ఉన్న ప్రతీ ఒక్కరు జియో సిమ్‌నే ఉపయోగిస్తున్నారు. కాల్స్, డేటా వంటి అన్ని సదుపాయాలను వినియోగారులకు ఉచితంగా అందిస్తూ జియో మిగితా నెట్‌వర్క్‌ల వినియోగదారులను కూడా తన వైపుకు తిప్పుకుంది. తొలుత మూడు నెలలు వెల్‌కం ఆఫర్‌గా ఈ ఉచిత సేవలను ప్రకటించిన జియో, ఆ తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కింద మరో మూడు నెలలు పెంచింది. అయితే ఈ ఆఫర్ మార్చి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో జియో వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జియో ఈ ఆఫర్‌ను మరో మూడు నెలలు పొడిగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.
అయితే ఈ ఆఫర్ పూర్తిగా ఉచితంగా కాదు. రూ.100 స్వల్ప రుసుము చెల్లించి దీన్ని వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్ జూన్ 30 వరకు కొనసాగించాలని భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కాల్స్‌కు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఇంతకు ముందే కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతానికి జియో వినియోగదారులు కాల్ డ్రాప్ సమస్యతో బాధపడుతున్నారు. కాగా ముందు ఈ సమస్యను కూడా జియో పరిష్కరించాలని విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles