Home తాజా వార్తలు రికార్డు నెలకొల్పిన ఆస్ట్రేలియా క్రికెటర్

రికార్డు నెలకొల్పిన ఆస్ట్రేలియా క్రికెటర్

మెల్ బోర్న్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న దేశవాళీ క్రికెట్ లో డార్సీ షార్ట్ అత్యధిక పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. వెస్టర్న్ తరపున ఓపెనర్ గా దిగిన షార్ట్ 257 పరుగులు చేశాడు. ఒక మ్యాచ్ లో వ్యక్తిగతంగా 23 సిక్సర్లు ఉండటం అతడి పేరిట మరో రికార్డు నమోదైంది.  53 బంతుల్లో శతకం బాది అనంతరం కేవలం 45 బంతుల్లోనే మరో సెంచరీ చేశాడు.  148 బంతుల్లో 257 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్డే మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్ మెన్ గా రికార్డు నెలకొల్పాడు. 2002 వసంవత్సరంలో సర్రే టీమ్ తరుపున ఆడిన అలిస్టర్ బ్రౌన్ 268 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. షార్ట్ 257 పరుగులు చేసినప్పటికి ఆ టీమ్ 387 పరుగుల వద్ద ఆలౌటైంది.  అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో మాత్రం భారత క్రికెటర్ రోహిత్ శర్మ  264 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు.

WACA

@WACA_Cricket

This man has just shattered the record books! ?@ShortDarcy smacked 257 off 148 balls against QLD — the highest score EVER in Australian one-day cricket!

JLT One-Day Cup 2018: D’Arcy Short record

Telangana news