Thursday, April 25, 2024

హోంగార్డు భార్యకు ఉద్యోగం

- Advertisement -
- Advertisement -

Job for the wife of the deceased home guard

నియామక పత్రం అందజేసిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర

హైదరాబాద్: అనారోగ్యంతో మృతిచెందిన హోంగార్డు భార్యకు ఉద్యోగ నియామక పత్రం అందజేశారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో శ్రీనయ్య హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అనారోగ్యంతో సెప్టెంబర్, 2020లో మృతిచెందాడు. శ్రీనయ్య భార్య ఇందిరకు ఉద్యోగం కల్పించారు. దానికి సంబంధించిన ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. హోంగార్డు భార్యను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర కుటుంబ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదించాలని కోరారు. తమ కుటుంబానికి ఉద్యోగం కల్పించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్రకు హోంగార్డు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిసిపి అనసూయ, ఎడిసిపి రియాజ్, హోంగార్డు ఎసిపి కృష్ణ, ఎసిపి మట్టయ్య పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News