Thursday, March 28, 2024

రేపు ఓయూలో నిరుద్యోగులకు జాబ్ మేళా..

- Advertisement -
- Advertisement -

Osmania University

మన తెలంగాణ/హైదరాబాద్: నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు రేపు మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఉస్మానియా యూనివర్శిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్పర్మేషన్, గైడెన్స్‌బ్యూరో డిప్యూటీ చీప్ అధికారి టి.రాము తెలిపారు. రిలియన్స్ జియో, పేటిఎం, కాలిబ్ హెచ్‌ఆర్, ఇన్నోవ్‌స్టోర్స్ సర్వీసెస్, శుభగ్రహ ప్రాజెక్టు, పేరంగ్రూపు వంటి 06 ప్రైవేటు కంపెనీల్లో పనిచేయుటకు దాదాపు 400మంది ఉద్యోగాల ఎంపికకు మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏదైనా పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, బిటెక్, పిజి, ఎంబిఏ చదవిన అభ్యర్దులు అర్హులని పేర్కొన్నారు. సీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ట్రైనిస్, ప్రమోటర్స్, మార్కెటింగ్ మేనేజర్స్ ఉద్యోగాలకు కోసం ఇంటర్వూ జరుపుతున్నట్లు వెల్లడించారు. ఎంపికైన వారికి నెలకు వేతనం రూ. 10వేల నుండి రూ.20వేలు వరకు ఇవ్వబడుతాయని, అభ్యర్దుల వయస్సు 19-30 సంవత్సరాల వారు అర్హులన్నారు. అర్హత, ఆసక్తి గల నిరుద్యోగులు తమ బయోడేటాతో పాటు విద్యార్హతల సర్టిఫికెట్ జీరాక్స్ కాఫీలతో ఈనెల 27న గురువారం ఆర్ట్స్ కళాశాల బిల్డింగ్ ఎదురుగా చీఫ్ వార్డెన్ బిల్డింగ్ పక్కన ఉన్న ఉస్మానియా మోడల్ కెరియర్ సెంటర్‌లో ఉదయం 10.30 గంటలకు జరుగనున్న జాబ్‌మేళాకు హాజరు కావాల్సిందిగా కోరారు.

Job Mela held in Osmania University on Feb 27

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News