Home రాష్ట్ర వార్తలు బికాం వారికి ఉద్యోగ అవకాశాలు

బికాం వారికి ఉద్యోగ అవకాశాలు

B.comమన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో సాధారణ డిగ్రీ చేసిన వారికి ఉద్యోగాలకు అవకాశం వచ్చింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజి బోర్డ్ లో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ లో అసిస్టేంట్ ఉద్యోగాలకు బికాం చదవిన వారు అర్హులుగా పేర్కొన్నారు. మొత్తం 115 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. వచ్చె నెల 19లోగా దరఖాస్తుల చేసుకోవాలి. నవంబర్ 29న రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా కంప్యూటర్ టెస్ట్‌కు 1:2 అభ్యర్థులను పిలుస్తారు. కంప్యూ టర్ వినియోగంలో కనీస అవగాహన, పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. అభ్యర్థులకు హైదరాబాద్‌లోనే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పోస్టులకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని కమిషన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.