Tuesday, April 23, 2024

వికలాంగుల శాఖలో పని చేయుటకు ట్రాన్స్‌జెండర్ అభ్యర్థుల నుండి దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ కో ఆర్డినేటర్‌గా పనిచేయుటకు ట్రాన్స్ జెండర్ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని కార్యాలయంలో హెల్ప్ డెస్క్ కో ఆర్డినేటర్ గా పనిచేయడానికి ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ చదివి ఉన్న ట్రాన్స్ జెండర్ పర్సన్స్ మాత్రమే అర్హులు. బిఎ (హ్యుమానిటీస్, సోశియాలజి, సోషల్ వర్క్, సైకాలజీ) ట్రాన్స్ జెండర్స్ సంక్షేమం కోసం పనిచేస్తూ ఉండి ఏడైనా ట్రాన్స్‌జెండర్ స్వచ్చంద సంస్థ లో మూడేళ్ళ అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

నెలకు రూ. 50 వేలు ఇవ్వడం జరుగుతుంది. వయస్సు 21-45 సంవత్సరాలకు మించి ఉండరాదు. దరఖాస్తు ఫారాలు, ఇతర వివరాల కోసం www.wdsc.Telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలతని సంచాలకులు బి. శైలజ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్ణీత దరఖాస్తు ఫారాలను పూరించి సంబంధిత ధృవపత్రాలు జతపరిచి ఈ నెల 10వ తేదీలోగా వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్ సాధికారత శాఖ మలక్‌పేట కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News