- Advertisement -
వాషింగ్టన్ : అమెరికాలో అరాచకానికి ట్రంప్ చర్యలే కారణం అని జో బైడెన్ విరుచుకుపడ్డారు. బిల్డింగ్‌పై జరిగిన దాడి దేశీయ ఉగ్రవాదుల చర్య అని, అక్కడ వ్యక్తం అయింది అసమ్మతి కాదని, అరాచకం అనరాదని, ఇది ఏకంగా కల్లోల కుట్ర అని మండిపడ్డారు. అక్కడ జరిగింది నిరసనపర్వం కాదని, వారి ఉద్ధేశాలను తాను కేవలం ఉగ్రవాద దాడి మూలాలుగానే పరిగణిస్తున్నట్లు తెలిపారు. అధ్యక్ష కాలం అంతా ప్రజాస్వామిక హననానికి పాల్పడుతూ వచ్చిన ట్రంప్ చిట్టచివరి తంతులో కూడా ఏకంగా తన మద్దతుదార్లను రెచ్చగొట్టి మారణకాండ సృష్టికి యత్నించినట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు. ఇంతవరకూ పరోక్షంగా అధికారపు ముసుగులో సాగించిన అరాచకం ఆయన అధికారాంతమున ప్రత్యక్ష దారుణకాండగా వెర్రితలలు వేసిందని విమర్శించారు.
- Advertisement -