Thursday, April 25, 2024

15 రోజుల్లో జె అండ్ జె కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్

- Advertisement -
- Advertisement -

Johnson and Johnson Corona Vaccine Clinical Trials in 15 Days

 

సామాన్యులకు సరసమైన ధరలో అందించడానికి ఉత్పత్తి పెంపు

కోల్‌కతా : సామాన్యులకు సరసమైన ధరలో కరోనా వ్యాక్సిన్‌ను సరఫరా చేసేలా ఉత్పత్తి సామర్ధాన్ని పెంపొందించుకోడానికి అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ సన్నాహాలు చేస్తోంది. లాభంతో నిమిత్తం లేకుండా 2021లో బిలియన్ కన్నా ఎక్కువ డోసుల వ్యాక్సిన్‌ను సరఫరా చేయాలన్న లక్షంతో ముందుకు వెళ్తోంది. ఈమేరకు మనుషులపై ట్రయల్స్ నిర్వహించడానికి తన షెడ్యూలు సెప్టెంబర్ నుంచి జులై రెండో భాగానికి ముందుకు జరిపింది. ప్రస్తుత ఉత్పత్తి సామర్ధాన్ని పెంచుకోవడంతోపాటు కొత్త యూనిట్లను నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సంస్థ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ పాల్ స్టొఫెల్స్ బెల్జియం నుంచి ఇ మెయిల్ ఇంటర్వూలో వివరించారు.

వ్యాక్సిన్ ఉత్పత్తి, అభివృద్ధిని వేగవంతం చేయడానికి కావలసిన ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి కోసం జాన్సన్ సంస్థ అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అనుకున్న సమయం కన్నా రెండు నెలలు ముందుగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ప్రీ క్లినికల్ డేటా బలంగా ఉండడం, రెగ్యులేటరీ అధారిటీస్‌తో అనుసంధానం కావడమే కారణంగా స్టొఫెల్స్ పేర్కొన్నారు. మరో 15 రోజుల్లో అమెరికా, బెల్జియంల్లో 1855 ఏళ్ల లోపు వారితోపాటు 65 ఏళ్లు పైబడిన ఆరోగ్యవంతులు 1045 మందిపై ఈ క్లినికల్ ట్రయల్స్ వివిధ దశల్లో నిర్వహిస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News