Home వార్తలు కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స

కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స

డాక్టర్ జి.కిరణ్‌కుమార్ రెడ్డి

ఆర్థోపెడిక్స్ అండ్ జాయింట్ రిప్లేస్‌మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపిక్
వైద్య నిపుణులు, యశోద హాస్పిటల్స్, సోమాజీగూడ.

Knee-joint2తగ్గిన శారీరక వ్యాయమం, ఆహారపు అలవాట్లతో పాటు జీవనశైలిలో వచ్చిన మార్పులు మోకాలు, తుంటి కీళ్ల నొప్పులకు దారి తీస్తున్నాయి. గతంలో ఒక వయస్సు మీరిన వారిలో మాత్రమే కనిపించే ఈ లోపాలు క్రమేణ చిన్న వయస్సులో వారిలో కూడా సాధారణంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి నొప్పులకు సంబంధించిన శరరం ఇస్తున్న సంకేతాలను ప్రాథమిక స్థాయిలో పసిగట్టడంలో విఫలమైతే దీర్ఘకాలంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంటుంది. ఆర్థరైటీస్ రాకుండా ముందస్తుగా తీసుకోవలసిన జాగ్రత్తలు, వస్తే ప్రాథమిక దశలో గుర్తించి సులభమైన మందుల ద్వారా సరి చేసుకొని జీవనశైలిని మార్చుకోవడం, కీళ్ల మార్పిడి గురించి ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవలసిన అవసరం ఉంది.
మోకాలు మరియు తుంటి కీలు శరీరంలోని అత్యంత ధృఢమైన అతి పెద్దదైన మరియు అత్యంత జటిలమైన కీళ్లు (జాయింట్స్). మీరు ఎప్పుడు నడిచినా, కూర్చున్నా, మెట్లు ఎక్కినా, కూర్చుని లేచినప్పుడూ, ఏ చిన్న కదలికైనా సరే మీరు ఆసరాకి, కదిలి సౌలభ్యానికి గానుఈ కీళ్లపైనే ఆధారపడుతారు. మీ కీల్లు ఆరోగ్యంగా ఉన్నంత కాలం మీరు, అది మీ కోసం చేసే పనిగురించి కనీసం ఒక్కసారైనా ఆలోచించకుండా దాని గురించి పట్టించుకోరు. అయితే అది నొప్పి పెట్టడం, పట్టేయడం మొదలైనప్పటి నుంచి మీరు అనివార్యంగా మీ కార్యకలాపాలు కొన్నింటిని పరిమితం చేసుకోవలసి వస్తుంది. స్వేచ్ఛగా తిరగగలగడం మీకు ఎంత అవసరమన్నది మీరు గ్రహించవచ్చును.
ఇప్పుడు అత్యాధునిక మరియు వినూత్నమైన వైద్య విధానాల ద్వారా ఎవరైనా సరే పూర్తి మోకాలి మరియు తుంటి కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సను చేయించుకొని మరియు ఉల్లాసవంతమైన జీవితాన్ని పొందవచ్చును. ప్రతి క్షణాన్ని ఆనందభరితం చేసుకోవచ్చును. ఇటువంటి శస్త్ర చికిత్స గురించి మరియు తెలుసుకోవాలి. సందేహాలను నివృత్తి చేసుకోవాలి.
ఆర్థరైటీస్ అంటే ఏమిటి?
ఆర్థరైటీస్ అంటే స్థూలంగా కీళ్ల అరుగుదల అని చెప్పుకోవచ్చు. సాధారణంగా కీళ్ల (జాయింట్లు) దగ్గర ఎముకల చివర్లలో పారదర్శకంగా ఉండే మృదులాస్థి అనే సున్నిత పదార్థంతో కప్పి ఉంటాయి. రక్తనాళాలు లేని, రక్త ప్రసారం ఉండని మృదులాస్థి తిరిగి జనించదు. దీనికి స్పర్శ కూడా ఉండదు.
ఈ మృదులాస్థి దెబ్బతిన్న లేదా పాడయినా జరిగే కీళ్ల అరుగుదలనే ఆర్థరైటీస్ అంటారు. అప్పుడు కీళ్లలో అంతర్లీనంగా ఉండే కణజాలం వెలుపలికొచ్చి తీవ్రమైన నొప్పి కలుగుతుంది.
రాకుండా ఎలా జాగ్రత్త పడగలం?
శరీర బరువు తగినంత ఉండేలా చేసుకోవాలి. శరీర బరువు పెరగకుండా నియంత్రించుకోవాలి.
కీళ్లకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. నడవడం, స్థానబద్ధం లేని జీవనశైలి విడనాడాలి.
ఒకవేళ ఆర్థరైటీస్ మొదలయితే వీలనయింత త్వరగా చికిత్స చేయించుకోవాలి.
చికిత్స ఎలా ఉంటుంది?
తొలి దశలో మృదులాస్థి (కార్డిలేజ్) బలపడడానికి మందులు వాడడం వల్ల చాలా వరకు ఉపయోగం ఉంటుంది.
చివరి దశల్లో మోకాళ్లులేక తొంటి మార్పిడి శస్త్ర చికిత్స అవసరం ఉంటుంది.
కీళ్ల మార్పిడి అవసరం ఎప్పుడు ఉంటుంది?
ఆర్థరైటీస్ తీవ్రమై కొన్ని నెలల పాటు వైద్యం జరిగినా కూడా కీళ్ల నొప్పులు తగ్గినప్పుడు, నడిచే విధానం మారినప్పుడు రోజు వారి కార్యకలాపాలలో కూడా ఇబ్బందులు గురవుతున్నప్పుడు (కొద్ది దూరం కూడా నడవలేక పోవడం, వంగలేక పోవడం, కూర్చోలేక పోవడం).
నిద్రించేటప్పుడు కూడా నొప్పి వస్తున్నప్పుడు ఇలాంటి సందర్భాలలో కీళ్ల మార్పిడి అనివార్యం కావచ్చును.
ప్రతి రోజు నొప్పి మాత్రలు మింగవలసిన అవసరం రావడం.
కీళ్ల మార్పిడి అంటే ఏమిటి?
ఆర్థరైటిస్ సరైనప్పుడు మోకాలులో మరియు తుంటిలో మృదులాస్థి, వాషర్‌లు తొలగిపోతాయి. వీటి స్థానంలో కృత్రిమ అవయవాన్ని ఏర్పాటు చేస్తారు.
కీళ్ల మార్పిడిలో ఫలితం ఎలా ఉంటుంది?
కీళ్ల మార్పిడిలో ఫలితం అనేది శస్త్రచికిత్స చేసే విధానంలో మరియు ఆర్థరైటీస్ యొక్క తీవ్రత మరియు శస్త్ర చికిత్స తర్వాత చేయవలసిన ఫిజియోథెరపి మీద ఆధారపడి ఉంటాయి.
గరిష్టంగా 99 శాతం విజయవంతం అవుతుంది. బాగా చూసుకుంటే 20 నుండి 30 సంవత్సరాల పాటు పరిపూర్ణంగా అన్ని రకాలుగా రోజు వారి పనులన్ని సజావుగా చేసుకోవచ్చు. (నడవడం, నేల మీద కూర్చోవడం, మెట్లు ఎక్కడం).
కీళ్ల మార్పిడికి అడ్డంకులు ఎమైనా ఉన్నాయా?
వయస్సు కాని, స్థూలకాయం కాని, బి.పి., షుగర్ గాని, హార్ట్, కిడ్నీ సమస్య గాని కీళ్ల మార్పిడి చికిత్సకు ఎలాంటి అడ్డంకులు కావు.
అత్యంత ఆధునాతనమైన కీళ్ల మార్పిడి
కేవలం చిన్న కోతతో కండరాలకు హాని లేకుండా (మినిమల్లీ ఇన్వెసివ్) చేసే ఈ సర్జరీ ద్వారా అతి త్వరగా కోలుకుంటారు. అతి తక్కువ నొప్పి. రక్తస్రావం కూడా తక్కువ.
మోకాలు పూర్తిగా వంగేలా క్రింద కూడా కూర్చో గలిగేలా డిజైన్ చేసిన కృత్రిమ పరికరం అమర్చడం.