Home తాజా వార్తలు ‘హ్యాపీ బర్త్ డే టూ ఇండియా, ఫ్రమ్ ఇండియా’

‘హ్యాపీ బర్త్ డే టూ ఇండియా, ఫ్రమ్ ఇండియా’

Jonty-Rhodes

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ తన ముద్దుల పాపకు మన దేశం పేరు కలిసి ఉండేలా ఇండియా జియాన్నే అని పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే రోడ్స్ ముద్దుల తనయ ఇండియా పుట్టిన రోజు నిన్న(ఆదివారం). దీంతో ఇండియాకు బర్త్ డే విషెస్ భారీ మొత్తంలో అందాయి. ఇండియాకు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపిన వారిలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఉన్నారు.

‘హ్యాపీ బర్త్ డే టూ ఇండియా, ఫ్రమ్ ఇండియా’ అంటూ మోడీ ట్వీట్ చేశారు. ప్రధాని ట్వీట్‌పై స్పందించిన రోడ్స్ ధన్యవాదాలు తెలిపారు. స్వయంగా మోడీ తన కూతురుకు బర్త్ డే విషెస్ చెప్పడంతో రోడ్స్ ఫ్యామిలీ ఆనందానికి అవధులేకుండా పోయాయి. ఎంతో సంతోషంగా ఉందని రోడ్స్ చెప్పాడు.