Home తాజా వార్తలు జర్నలిస్టుపై చేవెళ్ల ట్రైనీ ఎస్‌ఐ దాడి

జర్నలిస్టుపై చేవెళ్ల ట్రైనీ ఎస్‌ఐ దాడి

Journalist was attacked by a chevella trainee si

 

చేవెళ్ల: ప్రజల పక్షాన నిలిచి జర్నలిస్టులపై పోలీసుల దాష్టీకాలను నిరసిస్తూ జిల్లా జర్నలిస్టు సంఘ నేతలు ఆందోళనకు దిగారు. చేవేళ్లలోని ఒక పత్రిక విలేకరిపై ట్రైనీ ఎస్‌ఐ దురుసు ప్రవర్త నను నిరసిస్తూ టీయూడబ్లూజే పక్షాన శుక్రవారం ట్రైనీ ఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డి సస్పెండ్ చేయాలని ఆందోళన చేశారు. ప్రజల పక్షాన నిలిచి మాట్లాడిన ఓ పత్రికా ప్రతినిధి బండారు సుభాష్‌రెడ్డిపై దాడి చేసిన చేవెళ్ల ట్రైనీ ఎస్సై మహేశ్వర్‌రెడ్డిని పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని టీయూడబ్లూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొంపల్లి శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ దాడిని నిరసిస్తూ చేవెళ్ల నియోజకవర్గం జర్నలిస్టులు, జిల్లా స్థాయి జర్నలిస్టులు, ప్రజాల సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలో ఎస్సై మహేశ్వర్‌రెడ్డి తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ బీజాపూర్ హైదరాబాద్ అంతర్‌రాష్ట్ర రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఎక్కడ పనిచేస్తుందో చెప్పాలని జర్నలిస్టులు పెద్ద ఎత్తునా నినదించారు.

ఎస్సై మహేశ్వర్‌రెడ్డి డౌన్‌డౌన్, వెంటనే పోలీస్ ఉన్నతాధికారులు కల్పించుకుని ఎస్పైని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా పోలీస్‌స్టేషన్ ఎదుట బైటాయి ంచి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కొంపల్లి శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడు తూ ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులపై పోలీసులు ఆవలంభించిన తీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు తమ బాధ్యతలను మరిచి ప్రజల పట్ల, జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఎస్సైని సస్పెండ్ చేసేంతవరకు జర్నలిస్టులు ఆందోళన విరమించేదిలేదని చేవెళ్ల ఏసిపి రవీందర్‌రెడ్డికి తేల్చిచెప్పారు. విష యం తెలుసుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అక్కడి చేరుకుని పోలీస్ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కాలె యాదయ్య మం డిపడ్డారు.

అధికారులతో మాట్లాడి ట్రైనీ ఎస్సైపై చర్యలు తీసుకుంటామని చెప్పిన జర్నలిస్టులు వినలేదు. ట్రైనీ ఎస్సైని సస్పెండ్ చేసేవరకు కదిలేదిలేదని కరాఖండీగా చెప్పడంతో ఎమ్మెల్యే కాలె యాదయ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. చేవెళ్లలో నిర్వహిస్తున్న రైతు బంధు సంబురాలకు హాజరైన మంత్రి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అక్కడిచేరుకుని సమస్యను అడిగి తెలుసుకున్నారు. జర్నలిస్టులు మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. జర్నలిస్టు సుభాష్‌రెడ్డికి తగిన న్యాయం చేస్తామని చెప్పాడంతో జర్నలిస్టులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జర్నలిస్టులు గణేష్, శ్రీనివాస్‌చారి, గోపాల్, పడాల శ్రీనివాస్, మల్గారి దయాకర్‌రెడ్డి, మధు, రాకేష్, సలీమ్, రమేష్, ప్రవీణ్, శ్రీనివాస్, దేవేందర్, వెంకటేష్, మల్లికార్జున్, రాఘవేందర్, ఆయా పార్టీల నాయకులు దేవర వెంకట్‌రెడ్డి, ఎల్‌ఐసి ఏజెంట్ కిచ్చన్నగారి వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రామస్వామి, పడాల ప్రభాకర్, సత్యనారాయణ, మధుకర్‌రెడ్డి, మద్దెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Journalist was attacked by a chevella trainee si