Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) పల్లెకు పయనం

పల్లెకు పయనం

 పండుగకు ఊర్లకు తరలిన నగర జనం
సరిపోను రవాణ సౌకర్యాలు లేక ఇబ్బందులు
యథేచ్ఛగా దండుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్

TOUR

మన తెలంగాణ/సిటీ బ్యూరో : పట్నం వాసులు పల్లెకు పయనమయ్యారు. నగరంలో నిత్య వాహన రణధ్వనుల మధ్య క్షణం తీరిక లేకుండా యంత్రిక జీవనం గడిపిన నగరవాసులు పండగ నేపథ్యంలో పచ్చని పంట పొలాల మధ్య ప్రకృతి సౌం దర్యాన్ని ఆస్వాదిస్తూ పుట్టిన ఊరులో సంక్రాంతిని ఘనంగా జరుపు కునేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో నగర దారులన్నీ పల్లె బాట పట్టడడంతో బస్ స్టేషనన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతు న్నాయి. దీంతో గంటల కొద్దీ రైళ్ల, బస్సుల కోసం వేచిచూస్తున్న ప్రయాణికులు పడ రాని పాట్లు పడుతు న్నారు. ఎన్ని సర్కస్ పీట్లు ప్రదర్శించిన నిమిషాల్లో బస్సులు రైళ్లు నిండిపోతుం డడంతో మరో వాటికి కోసం పడిగాపులు కాస్తున్నారు. మరికొందరు సొంత వాహనాలతో పల్లెలకు పయనం కావడంతో వాహనాలతో రహదారులన్నీ రద్దీగా మారాయి. ప్రైవేటు వాహన దారులు ఇష్టానుసారంగా ఛార్జీలను వసూలు చేస్తూ నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు.