Home తాజా వార్తలు సరిహద్దులో ఉద్రిక్తత

సరిహద్దులో ఉద్రిక్తత

lockdown

 

ఎపి, తెలంగాణ పొలిమేరల్లోని పొందుగుల చెక్‌పోస్టు వద్ద పోలీసులపై రాళ్ల దాడి
తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్లే వారిని అడ్డుకోవడంతో ఆగ్రహం
గరికపాడు వద్ద మెరుగైన పరిస్థితి
దామరచర్ల వద్ద పరిస్థితి పరిశీలించిన మంత్రి జగదీశ్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రా- తెలంగాణ సరిహద్దులో దాచేపల్లి మండలం పొందుగల చెక్‌పోస్ట్ వద్ద పోలీసులపై గురువారం సాయంత్రం రాళ్ల దాడి చేయడంతో పోలీసులకు ప్ర యాణీకులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తెలంగాణలో ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కడివారు అక్కడే ఉండాలని గురువారం సాయ ంత్రం సిఎం జగన్ ప్రకటించిన కొద్ది సేపటికే తెలంగాణ నుంచి వెళ్లిన వారు అసహనానికి గురై దాచేపల్లి మండలం పొందుగల చెక్‌పోస్ట్ వద్ద పోలీసులపై రాళ్ల దాడి చేశారు. దీంతో పోలీసులు ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎంతో ఆశతో స్వంత గ్రామాలకు వెళ్లిన వారికి నిరాశ ఎదురైందని, బుధవారం రాత్రి నుంచి పడిగాపులు కాసి ప్రయాణీకులు సహనం కోల్పోయి రెచ్చిపోయి రాళ్లదాడికి దిగారు. కాగా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చేవారిని అడ్డుకునేందుకు పోలీసులు సరిహద్దుల్లో ఇనుప కంచెలు వేశారు. బార్డర్ దాటకుండా ముందస్తు భద్రత దృష్టాల పెద్దపాటి రాళ్లు, కంచెలతో పాటు వాహనాలను అడ్డుగా పెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన వాహన చోదకులు ఎపి పోలీసులపై దాడులకు పాల్పడ్డారు.

అత్యవసరాలకు అనుమతి
ఎపి- తెలంగాణ బార్డర్ గరికపాడు చెక్‌పోస్ట్‌వద్ద పరిస్థితి మెరుగైంది. ఆంధ్రా నుంచి పాలు, కూరగాయలు, ఆయిల్‌ట్యాంకర్లను పోలీసులు తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. తెలంగాణ నుంచి వైద్యపరమైన ఇబ్బందులు ఉన్నవారిని మాత్రమే ఎపిలోకి అనుమతిస్తున్నారు. సాఫ్ట్‌వేర్, ఇతర ఉద్యోగులెవరైనా ఆంధ్రాలోకి రావాలని ప్రయత్నిస్తే.. తెలంగాణ సరిహద్దులోనే తిప్పి పంపిచేస్తున్నారు. నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వాహనాలు బుధవారం నాడు నిలిచిపోవడంతో గురువారం నాడు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బుధవారం నాడు సాయంత్రం 4 గంటల పాటు పాల వాహనాలను నిలిపివేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో గురువారం ముందుగానే అన్నింటికి అధికారులు అనుమతులు ఇచ్చారు. తెలంగాణ నుంచి ఎవరైనా ఎపిలోకి వస్తామని ఒత్తిడి తీసుకొస్తే ఐసోలేషన్‌కు పంపిస్తున్నారు.

ప్రజల కోసమే కఠిన నిర్ణయాలు : మంత్రి జగదీష్ రెడ్డి
ఇక పై తెలంగాణ మీదుగా ఆంధ్రకు చేరే ఏ ఒక్కరినీ అనుమతించం ప్రతి ఒక్కరూ అందుకు సహకరించాలని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. స్వ గ్రామాలకు పోయే ఆత్రుత తో రాష్ట్ర సరిహద్దుల్లో చిక్కుకున్న విషయం ముఖ్యమంత్రి దృష్టికీ తీసుకపోయి అటు నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి ఎపిలో ప్రవేశించేందుకు ఒప్పించామన్నారు. అయితే ఇదే చివరి అవకాశమని, ఇకపై ఎవరిని అనుమతించే ప్రసక్తే లేదన్నారు. మహమ్మారి కరోనా వైరస్ ను పారద్రోలేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాలకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి సహకరించాలని కోరారు. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో అద్దంకి జాతీయ రహదారిపై ఉన్న దామరచర్ల చెక్ పోస్ట్ వద్ద 24 గంటలుగా సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు నిరీక్షిస్తున్న ఆంధ్రప్రజలను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గురువారం నాడు పర్యటించారు.

క్వారంటైన్ కంపల్సరీ
రాష్ట్ర సరిహద్దుల్లోకీ చేరుకున్న వారెవరు వైద్య పరీక్షలు చేపించుకోలేదని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుమతించిననా వైద్య పరీక్షల అనంతరమే మిమ్మల్ని ఇండ్లకు పంపించేదని మంత్రి జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు. అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించడంలో భాగంగా తెలంగాణా లో గ్రామాలకు గ్రామాలు స్వీయ నిర్బంధాన్ని పాటిస్తున్నారన్నారు. ఒక మనిషికి సోకిన వైరస్ వేల మందికి అటునుండి లక్షల మందికి చేరి అతలాకుతలం చేస్తున్నదన్నారు. మూడు సంవత్సరాలపసిపాప కు కరోనా వైరస్ సోకిందని విన్న అందుకు కారణం ఆ పాపా ఆత్మీయులే కారణం కావడం బాధాకరమన్నారు. స్వీయ నియంత్రణ పాటించనప్పుడే ఇటువంటి అనర్దాలు చవి చూడాల్సి ఉంటుందని, ఆత్మీయుల నుండే ఈ వైరస్ ప్రబలుతున్నప్పుడు రక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని అందుకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు.

Journos attacked by police during lockdown