Home తాజా వార్తలు జోయాలుక్కాస్ రూ.100 కోట్ల

జోయాలుక్కాస్ రూ.100 కోట్ల

Joyalukkas announces Rs 100 cr mega diwali cashback offers

 

మెగా దీపావళి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : దీపావళి పండుగను పురస్కరించుకొని జోయాలుక్కాస్ రూ.100 కోట్ల విలువైన మెగా దీపావళి క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న షోరూమ్‌లలో పరిమిత ఎడిషన్ ప్రత్యేక దీపావళి 2021 ఆఫర్ అందుబాటులో ఉంటుందని జోయాలుక్కాస్ ప్రకటించింది. మెగా దీపావళి క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లో భాగంగా ప్రతి రూ.50,000 విలువైన గోల్డ్ జువెలరీ కొనుగోలుపైనా రూ.1,000 విలువ కలిగిన గిఫ్ట్ ఓచర్, ప్రతి రూ.25,000 విలువ కలిగిన డైమండ్, అన్‌కట్, ప్రెషియస్ ఆభరణాల కొనుగోలుపై రూ.1000 గిఫ్‌ట ఓచర్‌ను అందించనున్నట్లు తెలిపింది. అలాగే రూ.10,000 విలవ కలిగిన వెండి కొనుగోలుపై రూ.500 బహుమతి ఓవచర్‌ను అందించనున్నట్లు తెలిపింది. ఎస్‌బిఐ కార్డుహోల్డర్లకు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ (ప్రతి కార్డుపై రూ.2,500 వరకు) పొందవచ్చని తెలిపింది. కొనుగోలు చేసిన ప్రతి జువెలరీకి ఏడాది పాటు ఉచిత బీమా సదుపాయాన్ని ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. మెగా దీపావళి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని షోరూమ్‌లలో అక్టోబర్ 22నుంచి నవంబర్ 5 వరకు అందుబాటులో ఉంటాయని జోయాలుక్కాస్ తెలిపింది.

Joyalukkas announces Rs 100 cr mega diwali cashback offers