Home సినిమా బిగ్ బాస్‌గా తారక్

బిగ్ బాస్‌గా తారక్

Bigg-Boss-NTR

హైదరాబాద్ : హిందీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వహించిన బిగ్ బాస్ షో ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తమిళంలో ఈ షోకి కమల్‌హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షో తెలుగులో కూడా రూపొందుతుంది. దీనికి జూ.ఎన్‌టిఆర్ వ్యాఖ్యాత. స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ షోకి సంబంధించిన తొలి పొస్టర్‌ని తారక్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశారు. ‘మిమల్ని చూడగలను’ అనే కామెంట్ పెడుతూ ఈ ఫోటోని అప్‌లోడ్ చేశారు. తమ అభిమాన హీరో తొలిసారిగా బుల్లితెరపై కూడా కనిపిస్తుండటంతో తారక్ అభిమానుల అనందానికి అవధులు లేకుండా పోయింది.