Home చిన్న సినిమాలు ఇట్స్ షో టైం…

ఇట్స్ షో టైం…

NTR'S-BIG-BOSS

హైదరాబాద్: ఇప్పటి వరకు బిగ్ స్క్రీన్ పై సత్తా చాటిన యంగ్ టైగర్ ఎన్ టిఆర్ బుల్లితెరపై కూడా హల్ చల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. దీనికోసం హిందీలో స‌ల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షోను తెలుగులో అదే పేరుతో ఎన్ టిఆర్ హోస్ట్ చేయ‌నున్నాడు. 12 మంది సెల‌బ్రిటీలు, 60 కెమెరాలు, 70 రోజులు, ఒక బిగ్ హౌజ్ ఇది ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌నున్న బిగ్ బాస్ షో పూర్తి వివరాలు. తాజాగా దీనికి సంబంధించి షో ఎప్పుడు ప్రసారం కానుంది తదితర వివరాలను వెల్లడించారు.

దీని ప్రకారం జూలై 16 నుండి ఈ ప్రోగ్రాం ప్రసారం కానుండ‌గా, సోమ‌వారం నుండి శుక్ర‌వారం వ‌ర‌కు రాత్రి 9.30ని.ల‌కు మరియు శ‌ని, ఆది వారాల‌లో రాత్రి 9గంల‌కు స్టార్ మాలో ప్ర‌సారం కానుంది. ఈ షో కోసం ఎన్ టిఆర్ భారీ పారితోషికం అందుకోనున్నాడనేది బయట టాక్. ప్రస్తుతం బిగ్ బాస్ షో ముంబైలో షూట్ చేస్తున్నారు. కాగా, తారక్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై లవకుశ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.