Home Default ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’ గీతాల ఆవిష్కరణ

‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’ గీతాల ఆవిష్కరణ

julietనవీన్ చంద్ర, నివేదా థామస్ జంటగా నటిస్తున్న చిత్రం ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’. కొత్తపల్లి అనురాధ సమర్పణలో అనురాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై కొత్తపల్లి ఆర్.రఘుబాబు, కె.బి.చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ వోధిరాల దర్శకుడు. రతీస్ వేగ మ్యూజిక్ దర్శకత్వంలో రూపొందిన పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో బిగ్ సీడీ, ఆడియో సీడీలను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. అదేవిధంగా థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ “మంచి కథతో చేసిన సినిమా ఇది. నవీన్‌చంద్ర మంచి పర్‌ఫార్మర్. అతనికి మంచి భవిష్యత్తు ఉంది. దర్శకుడు అజయ్ వోధిరాల మంచి టీంతో ఈ సినిమా చేశాడు. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ “మా దర్శకుడు అజయ్ చాలా మొండోడు. షాట్ బాగా వచ్చే వరకు వదలడు. రతీస్ వేగ అద్భుతమైన పాటలను అందించారు. నివేదాతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది”అని చెప్పారు. నిర్మాత కొత్తపల్లి ఆర్.రఘుబాబు మాట్లాడుతూ “సినిమా ప్రారంభం నుండి సుకుమార్ ఎంతో సహకారం అందిస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా దర్శకుడు అజయ్ ఈ సినిమాను తెరకెక్కించారు. కథన నమ్మి హీరో నవీన్‌చంద్ర ఈ సినిమా చేశారు”అని తెలిపారు. దర్శకుడు అజయ్ వోధిరాల మాట్లాడుతూ “విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఎంటర్‌టైనర్ మూవీ ఇది. సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకముంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, నవీన్‌చంద్ర తల్లి రాజేశ్వరి, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, విజయ్ బండ్రెడ్డి, రామజోగయ్య శాస్త్రి, ఎస్తర్ తదితరులు పాల్గొన్నారు.