Home సినిమా 15న ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’

15న ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’

Juliet-Lover-of-Idiot

నవీన్‌చంద్ర, నివేదా థామస్ జంటగా కొత్తపల్లి అనురాధ సమర్పణలో అనురాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ వోధిరాల దర్శకత్వంలో కొత్తపల్లి ఆర్.రఘుబాబు, కె.బి.చౌదరి నిర్మించిన చిత్రం ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’. ఈ చిత్రం ఈనెల 15న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హీరో నవీన్‌చంద్ర, స్టార్ కమేడియన్ ఆలీ, దర్శకుడు అజయ్ వోధిరాల పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలీ మాట్లాడుతూ “ఇడియట్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. జూలియట్ అనే సినిమా తెలుగులో రాలేదు. ఇంగ్లీష్‌లో వచ్చింది. ఆ సినిమా కూడా పెద్ద హిట్. ఆ సినిమాల్లాగే ఈ చిత్రం కూడా ఘన విజ యం సాధిస్తుంది. అందాల రాక్షసి చిత్రం నుంచి నవీన్ చాలా మంచి సినిమాలు చేశాడు. ఇది అతనికి మరో అందమైన లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించడం వల్ల కొంత ఆలస్యమైంది. ఇందులో నేను ఓ కామెడీ విలన్‌గా కనిపిస్తాను”అని అన్నారు. హీరో నవీన్‌చంద్ర మాట్లాడుతూ “సినిమా టైటిల్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ట్రైలర్‌కు 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. పాటలు అందరికీ నచ్చాయి. హీరోయిన్ నివే దా మొదట కమిట్ అయిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత ఆమె చాలా మంచి సినిమా లు చేశారు. ఈ చిత్రంలో ఆమె అద్భుతంగా నటించారు. కామెడీ విలన్‌గా ఆలీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. ఇద్దరం కలిసి 20 రోజులు పనిచేశాం. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. దర్శకుడు అజయ్ ప్రతి సీన్‌ను ఎంతో సహజంగా తీశారు”అని తెలిపారు. దర్శకుడు అజయ్ వోధిరాల మాట్లాడుతూ “సింపుల్‌గా ఉండే బెస్ట్ లవ్ స్టోరీ ఇది. ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడే నవీన్‌కి ఇది సూపర్‌హిట్ అవుతుందని చెప్పాను”అని పేర్కొన్నారు.