Home రంగారెడ్డి షాద్‌నగర్‌లో… ఎన్నికల హోరు

షాద్‌నగర్‌లో… ఎన్నికల హోరు

Jumping japan in the constituency

నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్‌ల సందడి
పల్లెలలో కొనసాగుతున్న ప్రచార హోరు…
టికెట్టు కోసం నేతల పాట్లు

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా : రాజకీయ వేడి రాజుకుంది. రాజకీయ చైతన్యం అధి కంగా ఉండటంతో పాటు ఆర్ధికంగా బలమైన వనరు లు ఉన్న నేతలు నియోజకవర్గంలో ఉండటంతో అన్ని పార్టీలలో టికెట్‌ల కోసం నేతలు పోటీపడుతున్నారు. పాలమూరు జిల్లాలో ఉన్న షాద్‌నగర్ నియోజకవర్గం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతో రంగారెడ్డి జిల్లాలోకి వ చ్చింది. షాద్‌నగర్ మున్సిపాలిటీతో పాటు ఫరూక్‌నగ ర్, కొత్తూర్, కేశంపేట్, కొందూర్గు, చౌదరిగూడం, న ంది గామ మండలాలు నియోజకవర్గ పరిధిలో ఉన్నా యి. పారిశ్రామిక అభివృద్ధ్దితో పాటు రియల్ రంగం లో నియోజకవర్గం శరవేగంగా దూసుకుపోతుండటం తో అన్ని పార్టీలలో నాయకత్వంతో పాటు క్యాడర్ సై తం జోష్‌లో కనిపిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నిక లలో టిఆర్‌యస్ తరపున బరిలోకి దిగి సిట్టింగ్ ఎమ్మె ల్యే అంజయ్య యాదవ్ తన ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీకి చెంది న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిపై అనూ హ్యంగా విజయం సాధించారు.

ఎమ్మెల్యేగా విజయం సాధించిన అంజయ్య యాదవ్ అనంతరం నియోజకవ ర్గంలో పూర్థి స్థాయిలో పట్టు సాధించడానికి టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతి నిధులు, ద్వితీయ శ్రేణి నేతలతో పాటు పెద్ద ఎత్తున క్యా డర్‌ను తన వైపుకు తిప్పుకుని నియోజక వర్గంలో తనకంటు ప్రత్యేక వర్గంను ఏర్పాటు చేసుకున్నారు. 2019 ఎన్నికలలో సైతం తనకే టికెట్ ఖాయమ న్న దీమాతో నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. 2014 ఎన్నికలలో అంజయ్య యాదవ్ విజయంలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నేతలు వీర్లపల్లి శంకర్, అందే బాబయ్య ముదిరాజ్‌లు సైతం టికెట్ కోసం తమ వంతు లాబీయింగ్ చేస్తున్నారు. వీర్లపల్లి శంకర్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలతో పాటు సామాజీక సేవ కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. అందే బాబయ్య కు టిఆర్‌యస్ రాష్ట్ర కార్యదర్శి పదవిని కట్టబెట్టి నియోజకవర్గాలకు పార్టీ ఇంచార్జీ భాద్యతలు సైతం అప్పగించారు. సామాజీక కార్యక్రమాలు నిర్వహిస్తు ప్రజలకు ద గ్గరవుతున్న మరోనేత సోమిరెడ్డి నరెందర్ రెడ్డి సైతం షాద్‌నగర్ టికెట్ ఆశీస్తున్నారు. పాలమూరు ఎంపి ఎ.పి .జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి పేరు సైతం టికెట్ రేసులో వినిపిస్తుంది. నియోజకవర్గంలో టిఆర్‌యస్ పార్టీ పటిష్టంగా ఉన్న వర్గాలుగా విడిపోయి ఎవరికి వారుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో క్యాడర్‌లో కొంత మంది ఆయోమయంగా కనిపిస్తున్నారు.

కాంగ్రెస్ నుంచి బరిలోకి ప్రతాప్‌రెడ్డి ఖాయం….
టిఆర్‌యస్‌లో టికెట్ కోసం దాదాపు ఐదు మంది ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ మాత్రం మాజీ ఎ మ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డికి ఖాయంగా కనిపిస్తుంది. 2014 ఎన్నికలలో ఓటమి పాలైన నాటి నుంచి నేటి వర కు నియోజకవర్గంను అంటిపెట్టుకోవడంతో పాటు ప్రతి రోజు నియోజకవర్గంలో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉంటు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో కొంత మంది నేతలు అధికార పార్టీలోకి వలస పోయిన ఎన్నికల సమయంలో తిరిగి ప్రతాప్‌రెడ్డి దగ్గరకు చేరడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న పార్టీ పరిస్థీతి అంతంత మాత్రంగానే మారింది.

గత ఎన్నికలలో టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్ధిగా బరిలోకి దిగిన బిజెపి నేత ఎన్. శ్రీవర్ధన్ రెడ్డి మరోమారు బరిలోకి దిగడానికి సిద్దం అవుతుండగా స్థానికంగా డాక్టర్‌గా విధులు నిర్వహిస్తు రాజకీయ కుటుంబంకు చెందిన యువకుడు సైతం బిజెపి టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జ రుగుతుంది. జర్నలిస్టు సంఘం నేత గుడిపల్లి శ్రీనివాస్ సైతం సేవ కార్యక్రమాలు నిర్వహిస్తు ముందుకు సాగుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీ నుంచి చాన్స్ వచ్చే అ వకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వైసిపి తరపున జిల్లా అధ్యక్షుడు సుదాకర్ రెడ్డి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. వామపక్షాలు, టిజెఎస్, తెలంగాణ ఇ ంటి పార్టీలు సైతం ఇక్కడ నుంచి తమ అభ్యర్దులను బరిలోకి దించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. షాద్‌నగర్ కా ‘బాద్‌షా’ సీటుపై చాలా మంది నేతలు కన్నువేసిన ప్రధాన పోటి మాత్రం అధికార టిఆర్‌యస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మద్య ఉండటం ఖాయం.