Home తాజా వార్తలు ఎంజిఎం ఆసుపత్రిలో జూడాల ధర్నా

ఎంజిఎం ఆసుపత్రిలో జూడాల ధర్నా

Junior doctors protest at Waramgal MGM hospital

 

వరంగల: ఎంజిఎం ఆసుపత్రిలో రోగుల వైద్యసేవల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఎంజిఎం జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించి ఎంజిఎంలో బుధవారం ధర్నా నిర్వహించారు. పెంచిన స్టయిఫండ్ ప్రోత్సకాలు చెల్లించాలని ఈనెల 10న నోటీసు ఇచ్చినప్పటికి ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడంతో పెంచిన స్టయిఫండ్ ప్రోత్సకాలు చెల్లించాలని డిమాండు చేస్తూ సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో కరోనాయేతర సేవలను బహిష్కరించాలని జూడాలు నిర్ణయం తీసుకున్నారు. జూనియర్ వైద్యులు ధర్నా నిర్వహించడంతో ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.

Junior doctors protest at Waramgal MGM hospital