* కలెక్టర్ వెంకటరామిరెడ్డి
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : ప్రాజెక్టుల ని ర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న వారికి తగిన న్యాయం చేస్తామని, ఒకరికొకరు సహకరించు కుంటూ ముందుకు వెళదామని కలెక్టర్ వెంకటరామి రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కలక్టరేట్‌లో హుస్నా బాద్ డివిజన్‌లోని గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు బాధితు లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గౌరవెల్లి ప్రాజక్టు భూ నిర్వాసితులతో చర్చించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మెజార్టీ ప్రజల సమ్మతి, అనుకూలత ప్రామానికమని ఆ విధానాల మేరకు చట్టాలను అమలు చేస్తామని తెలిపారు. ఒకరికొకరం సహకరించుకుం టూ ముందుకు వెలదామని, భూనిర్వాసితులకు ప్రభుత్వం తగిన న్యా యం చేస్తుందని అన్నారు. గతంలో చర్చించిన విధంగా అర్జీలు సమర్పిం చాలని, మీరిచ్చే అర్జీల ప్రకారం తగు న్యాయం చేస్తామని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూ సేకరణ జరుపుతున్న క్రమంలో స్వయంగా తాను ప్రభుత్వంతో చర్చించి మీకు చేయాల్సిన ప్రత్యామ్నాయ సహకారం అం దిస్తామని నిర్వాసితులకు హామీ ఇచ్చారు. అనంతరం గౌరవెల్లి, గుడా టిపల్లి, రేగొండ గ్రామస్థులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రజా సమస్యలు ఏవైనా అధికారులు పరిష్కరిస్తారని ఆయా గ్రామాల పెద్దలతో కలసి నివే దిక రూపంగా విన్నవించాలని తెలిపారు. ఈ సమావేశంలో జెసీ పద్మా కర్, ఆర్డీవిఒ శంకర్‌లతో పాటు అధికారులు పాల్గొన్నారు.