Home తాజా వార్తలు ప్రపంచ ఆర్చరీ ఫైనల్లో అభిషేక్‌-జ్యోతి జంట

ప్రపంచ ఆర్చరీ ఫైనల్లో అభిషేక్‌-జ్యోతి జంట

Jyothi and abhishek advance in archery world cup

 

యంక్టాన్: అమెరికా వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన అభిషేక్ వర్మ – జ్యోతి సురేశ్ వెనమ్ జంట కాంపౌండ్ మిక్స్‌డ్ విభాగంలో ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత జోడీ విజయం సాధించింది. నువ్వానేనా అన్నట్టు సాగిన సెమీస్ సమరంలో అభిషేక్ జంట 159156 తేడాతో కొరియాకు చెందిన కిమ్ యున్హికిమ్ జాంగో జంటను ఓడించింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తికంగా సాగింది. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన భారత జంట స్వర్ణం రేసుకు చేరుకుంది. ఇక శుక్రవారం జరిగే ఫైనల్లో అభిషేక్‌జ్యోతి జంట కొలంబియాకు చెందిన సారా లోపేజ్‌డానియల్ మునోజ్ జోడీతో తలపడుతుంది. సెమీస్‌లో కొలంబియా జంటు 157155 తేడాతో డెన్మార్క్‌కు చెందిన టాంజామథియాస్ జోడీని ఓడించింది. ఇక జ్యోతి మహిళల కంపౌండ్ టీమ్ విభాగంలో ఫైనల్‌కు చేరింది. జ్యోతి, ప్రియ గుజ్జార్, ముస్కాన్‌లతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో ప్రవేశించింది. శుక్రవారం జరిగే ఫైనల్లో భారత టీమ్ కొరియాతో తలపడుతుంది.

Jyothi and abhishek advance in archery world cup