Friday, March 29, 2024

ఆ గొప్ప అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేను

- Advertisement -
- Advertisement -

K Raghavendra Rao birthday celebrations

 

తెలుగు సినిమాని అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన దర్శకుడు కె.రాఘవేంద్ర రావు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో ఆయన రూటే సెపరేటు. ఇక హీరోయిన్‌ను గ్లామరస్‌గా చూపించడంలో రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కమర్షియల్ మూవీస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ దర్శకేంద్రుడు నవరసాలు కలబోసిన చిత్రాలను తీసి ప్రేక్షకులను పరవశింపజేశారు. హీరో హీరోయిన్స్‌ని తెరపై ఎంత అందంగా చూపించాలో.. ఏ కెమెరా యాంగిల్స్ లో చూపించాలో ఆయనకు తెలిసినంతగా మరే దర్శకుడికి తెలియదు అనడంలో అతిశయోక్తి లేదు. టాలీవుడ్‌లో ఒకప్పటి స్టార్ హీరోలందరితో సినిమాలు తీసిన రాఘవేంద్రరావు ఈ తరం హీరోలతో కూడా సినిమాలు రూపొందించారు. శోభన్ బాబు హీరోగా నటించిన ‘బాబు’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు శనివారం తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు.

ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకి బర్త్ డే విషెస్ చెప్పారు. మహేష్ బాబుని టాలీవుడ్‌కి హీరోగా ‘రాజకుమారుడు’తో పరిచయం చేసింది దర్శకేంద్రుడే. మహేష్ బాబు ట్విట్టర్‌లో ఆయనకు విషెస్ చెబుతూ వారిద్దరూ కలిసి పనిచేసిన ‘రాజకుమారుడు’ మూవీ ఆన్ లొకేషన్ ఫొటోను షేర్ చేశారు. ”హ్యాపీ బర్త్ డే మామయ్య… మీ లాంటి జీనియస్ డైరెక్టర్‌తో పనిచేసిన గొప్ప అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేను. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు. కాగా మహేష్ ఈ ట్వీట్ లో దర్శకుడు రాఘవేంద్రరావుని ‘మామయ్య’ అని సంబోధించడం విశేషం.

వాస్తవానికి మహేష్ ఎప్పుడూ రాఘవేంద్రరావుని ‘మామయ్య’ అని.. రాఘవేంద్రరావు మహేష్ బాబుని ‘అల్లుడు’ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని వీరిద్దరూ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రాజకుమారుడు’ సినిమా రొమాంటిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రీతి జింటా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో సి.అశ్వనీదత్ నిర్మించారు. ఈ మూవీలో కృష్ణ కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం సూపర్ స్టార్‌గా వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్‌కి గట్టి పునాది వేసింది దర్శకుడు రాఘవేంద్ర రావు అని చెప్పవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News