Home అంతర్జాతీయ వార్తలు బాహ్య గ్రహంపై బయటపడిన నీటి జాడ

బాహ్య గ్రహంపై బయటపడిన నీటి జాడ

Plamet

లండన్ :భూమికి 110 కాంతి సంవత్సరాల దూరంలో సింహరాశి నక్షత్ర సమూహంలో కె218 అనే మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న కె218బి అనే గ్రహాన్ని బ్రిటన్‌లోని యూనివర్శిటీ కాలేజి ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది భూమి కన్నా ద్రవ్యరాశిలో ఎనిమిది రెట్లు పెద్దది.  ఇందులో విశేషం ఏమంటే సౌరవ్యవస్థ బయట భూమి వాతావరణాన్ని పోలిన వాతావరణం కలిగిన గ్రహం ఇదే కావడం. ఈ గ్రహంపై నీరు ద్రవ స్థితిలో ఉంది. ఈ నీరు, వాతావరణం ఇక్కడ నివసించడానికి అనుకూలంగా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. భూమిపై ఉండే రేడియేషన్ కన్నా అయిదు శాతం ఎక్కువ రేడియేషన్ ఈ గ్రహంపై ఉంటుంది. మైనస్ 8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. మరుగుజ్జు ఎర్రనక్షత్రం ప్రభావంవల్ల రేడియేషన్ ఎక్కువగా ఉండి భూమిలా కాకుం డా ప్రతికూల వాతావరణం కలిగి ఉండవచ్చని పరిశోధనలతో సంబంధం లేని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎవరు ఎలా భావించినా ప్రస్తుతం ఇది నివాసానికి అనుకూలంగానే ఉంటుందని బ్రిటన్ పరిశోధకులు చెబుతున్నారు. మొట్టమొదట ఈ గ్రహాన్ని 2015లో కనుగొన్నారు. సౌరవ్యవస్థ బయట ఉండే బాహ్యగ్రహాలు కొన్ని వందల్లో ఈ గ్రహం ఒకటి. నీటి ఆవి రి ఉనికి కనిపిస్తున్నందున నైట్రొజన్, మెథేన్ కూడా ఉండవచ్చని అయితే ప్రస్తుత పరిశోధనలో అవి కనిపించ లేదని పరిశోధకులు వివరించారు.

K218b EXO PLANET NASA DISCOVERED EARTH LIKE Planet