Home తాజా వార్తలు ‘కడప కింగ్‌’గా పవన్..?

‘కడప కింగ్‌’గా పవన్..?

Power-star-Pawan-Kalyan123హైదరాబాద్: గత నెలలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మూవీని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. తమిళ డైరెక్టర్ ఎస్‌జె సూర్య ఈ చిత్రానికి దర్శకుడు. కాగా, ఈ సినిమాపై రోజుకో పుకారు హల్‌చల్ చేస్తోంది. మొదట్లో ఈ చిత్రానికి ‘హుషారు’ అనే వర్కింక్ టైటిల్‌తో సినిమాను చేస్తున్నట్టుగా ఓ వార్త షికారు చేసింది. ఆ తర్వాత ‘హుషారు’ ఫైనల్ టైటిల్ కాదని త్వరలోనే టైటిల్‌ను ప్రకటిస్తామని చెప్పారు. తాజాగా ఈ చిత్రానికి పేరు ఫిక్స్ చేశారన్న టాక్  వినిపిస్తోంది. చిత్ర నిర్మాత శరత్ మరార్ ఫిలిం ఛాంబర్‌లో ‘కడప కింగ్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. అయితే ఇదే పవన్ సినిమా టైటిల్ అన్న టాక్ బయటకు వస్తోంది. అంతేగాక మూవీ ఓపెనింగ్ రోజున పవన్ ఫ్యాక్షనిస్ట్‌లా తెల్లబట్టల్లో దర్శనమివ్వడం కూడా దీనికి ఊతమిస్తోంది. అయితే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.