Home తాజా వార్తలు క‌డెం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి వేత

క‌డెం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి వేత

kadem project

 

నిర్మల్ : జోరుగా కురుస్తున్న వర్షాలతో క‌డెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. క‌డెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో మంగ‌ళ‌వారం సాయంత్రం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రాజెక్టు వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఒక్కో గేటును 10 అడుగుల మేర ఎత్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్ర‌స్తుతం ప్రాజెక్టులో 693.675 అడుగులకు నీరు చేరుకుందని నీటిపారుద‌లశాఖ అధికారులు తెలిపారు.

ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి 29,169 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంద‌ని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ & ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ ఎం. ప్రశాంతి, ఎస్పీ శశిధర్ రాజు, నీటిపారుదల శాఖ ఎస్ఈ(ఎస్ఆర్ఎస్పీ) శ్రీనివాస్ రెడ్డి, ఈఈ రాజశేఖర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

kadem project gates lifted