Home ఆంధ్రప్రదేశ్ వార్తలు సిఐ నుంచి ఎంపిగా…

సిఐ నుంచి ఎంపిగా…

Kadiri CIఅనంతపురం : కదిరి సిఐగా పని చేసిన గోరంట్ల మాధవ్ వైసిపి నుంచి హిందూపురం ఎంపిగా విజయం సాధించారు. గురువారం ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తాను సిఐగా పని చేసినప్పుడు తనపై అధికారులు మాధవ్ కు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో వారి మధ్య ఆసక్తికర సంభాషణ చేటు చేసుకుంది. తాను ఏ స్థాయికి వెళ్లినప్పటికీ, తనపై అధికారులుగా పని చేసిన వారిని గౌరవిస్తానని, ఎప్పటికీ విధేయుడుగానే ఉంటానని మాధవ్ తెలిపారు. ఎప్పుడు పేరు పెట్టి పిలిచినా పలికే వ్యక్తిని తానంటూ మాధవ్ పేర్కొన్నారు. ఎన్నికల ముందే మాధవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆయన వైసిపి నుంచి పోటీ చేసి ఎంపిగా విజయం సాధించారు. కర్నూల్ సిఐడి డిఎస్ పి మహబూబ్ బాషా, మాధవ్ ల మధ్య ఈ ఆసక్తికర సంభాషణ జరిగింది.  తాను ఎంపి అయినప్పటికీ గొప్పలు పోనని, తన మూలాలను మర్చిపోనని మాధవ్ స్పష్టం చేశారు. తనను ఎంపిగా గెలిపించిన హిందూపురం ప్రజలకు మాధవ్ ధన్యవాదాలు తెలిపారు.

Kadiri CI Elected As MP From Hindupur