Friday, December 2, 2022

కాంగ్రెస్ కు కెసిఆర్ ను విమర్శించే హక్కు లేదు: కడియం

- Advertisement -

Kadiyam Srihari Comments

 

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుచాయని కడియం శ్రీహరి పేర్కొన్నారు. కాంగ్రెస్ కు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కెసిఆర్ ను విమర్శించే నైతిక హక్కు లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ భ్రష్టుపట్టించిందని కడియం అన్నారు. టిఆర్ఎస్ కు నీతులు చెప్పే స్థాయి కాంగ్రెస్ కు లేదని ఏదేవా చేశారు. రాజ్యాంబద్ధంగానే కాంగ్రెస్ ఎంఎల్ఎలు టిఆర్ఎస్ లో విలీనమయ్యారని కడియం శ్రీహరి వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీతో ప్రజలు టిఆర్ఎస్ అభ్యుర్థులను గెలిపించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జెడ్ పి, ఎంపిపి పదవుల్లో బిసిలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, కష్టపడి పని చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఇతర పార్టీల ఎంఎల్ఎలు, ఎంపిలను కాంగ్రెస్ లో చేర్చుకున్నప్పుడు ఉత్తమ్ కు సోయి లేదా..? అని, ఈ ఎన్నికల ఫలితాలతోనైనా కాంగ్రెస్, బిజెపిలు బుద్ధి తెచ్చుకోవాలని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.

Kadiyam Srihari Comments on Congress and BJP

Related Articles

- Advertisement -

Latest Articles