Tuesday, April 23, 2024

అఖిలేష్ దెబ్బకు మోడీ మూతి, ముక్కు పగిలిపోతుంది: కడియం

- Advertisement -
- Advertisement -

Kadiyam srihari comments on Modi

హైదరాబాద్: 2020-21లో కోటి 10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే మూడు కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని ఎంఎల్‌సి కడియం శ్రీహరి తెలిపారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. యాబై వేల కోట్ల రూపాయలు సంక్షేమ రంగంపై ఖర్చు చేస్తున్నామని వివరించారు. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా పథకాలతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ బాగా పర్‌ఫామ్ చేస్తోందని కేంద్రమే చెప్పిందని గుర్తు చేశారు.

బిజెపి నేతలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎనిమిదేళ్లలో ఏ ఒక్క విభజన హామీని మోడీ ప్రభుత్వం నెరవేర్చలేదని దుయ్యబట్టారు. సభ్యత, స్థాయినిమరిచి ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటికీ 14 శాతం మందికి ఆహారం అందడం లేదన్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ 101వ స్థానంలో ఉందన్నారు. దేశంలో ధనికులు ఇంకా ధనికులవుతున్నారని, పేదలు ఇంకా పేదలవుతున్నారని తెలియజేశారు. బిజెపి కర్నాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో అక్రమంగా అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేష్ దెబ్బకు మోడీ మూతి, ముక్కు పగిలిపోతాయని జోస్యం చెప్పారు. పంజాబ్‌లో ఆప్ దెబ్బకు బిజెపి విలవిలలాడుఖాయమన్నారు. బిజెపి రైతు వ్యతిరేక పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News