Home వరంగల్ రూరల్ ఖానాపురంలో గిడ్డంగి ప్రారంభం

ఖానాపురంలో గిడ్డంగి ప్రారంభం

Kadiyam Srihari Sppech About Farmers Devlopments

మన తెలంగాణ/ఖానాపురం : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో రైతే రాజ్యంగా ఏర్పడాలని దృఢ నిశ్చయంతో మండలంలోని ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థం గల గిడ్డంగిని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా శనివారం, సివిల్ సప్లై చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎస్‌ఎంసి చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన మార్కెట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24 గంటల విద్యుత్‌ను ఇచ్చిన ఘనత కెసిఆర్‌దే అన్నారు. రైతులకు రుణమాఫీ, రైతుబంధు పథకంలో ఎకరాకు 4వేల రూపాయలు దేశంలోనే మొదటగా పంపిణీ చేసింది కెసిఆర్ ప్రభుత్వమే అన్నారు. రాష్ట్రంలో పట్టాదారు పాస్ పుస్తకాలు సర్వే చేయించి రైతుకు హక్కును కల్పించామని అన్నారు. రూరల్ జిల్లాలో ఖానాపురం మండలంలో పాకాల ఆయకట్టు పరిధిలో దాదాపు 25 వేల ఎకరాల వరకు సాగు చేస్తున్నారని అన్నారు. ఈ ఎకరాలలో కొంత మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు.కొన్ని సర్వే నెంబర్లలో పిఒటి ల భూములున్నాయని అన్నారు. మంగళవారిపేటలో వక్వా ,జాగీర్‌దార్ భూములు ఉన్నాయని అన్నారు. ఈ భూముల వలన రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. పార్ట్ బి లో ఈ భూములకు పట్టాలు వచ్చే విదంగా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలియజేశారు.

ప్రభుత్వం ఎలాంటి భూములకైనా రైతులకు అన్యాయం జరగకుండా న్యాయం జరిగేవిదంగా చూస్తామని తెలియజేశారు. అటవి భూములలో రైతులు సేద్యం చేస్తుంటే అటవి అధికారులు వారిపైనా దాడి చేయడం అమానుషం అన్నారు. గొర్రెల కాపరులు గొర్రెలను మేపుతుంటే వారిపైన దాడి చేయడం నేరమన్నారు. వెంటనే అటవి అధికారులపై చర్య తీసుకోమని కలెక్టర్ హరితకు సూచించారు. రైతులకు సర్వెనెంబర్లలో పట్టాలు చెక్కులు రాకపోయిన ఆందోళన చెందవద్దని కాంగ్రేస్ నాయకులు అధికార పార్టిపై బురద చల్లడమే తప్ప వారు చేసేదేమిలేదని ఎద్దేవా చేశారు. గోదాంలలో రైతు దాన్యంను నిలువ ఉంచుకునేందుకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. కలెక్టర్ హరిత మాట్లాడుతూ రైతులు పట్టాలు రాలేదని ఇబ్బంది పడవద్దని పార్ట్ బిలో అందిస్తామని తెలియజేశారు. పెద్ది మాట్లాడుతూ మండలంలో గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్దిని చేశామని అన్నారు. సబ్ స్టేషన్ లు, గోదాంలు నిర్మించామన్నారు. కేసిఆర్ ప్రభుత్వం రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటారని అతను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చిన వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల పార్టి అధ్యక్షుడు వేములపల్లి ప్రకాశ్ రావు, ఆర్‌ఎస్‌ఎస్ కొఆర్డినేటర్ కుంచారపు వెంకటరెడ్డి, ఆర్డివో రవి, ఎమ్మార్వో రజని, నర్సంపేట మున్సిపాల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ,   యంపిటిసి దేవినేని జ్యోతి,పుల్‌సింగ్ , బిసి సెల్ అధ్యక్షుడు వల్లెపు శ్రీను,ఎఇఒ శ్యాం,తో పాటు తదితరులు పాల్గొన్నారు.